ఉమ్మడి సర్వీసు రూల్స్ ఎందుకు కోర్టులలో నిలబడటం లేదో తెలుసా?

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
🍇
*ఉమ్మడి సర్వీసు రూల్స్ ఎందుకు కోర్టులలో  నిలబడటం లేదో తెలుసా ?*
*✍️ 1975 లో G.O No’s : 665  – 667 ద్వారా AP లోని ప్రతి Govt Office లోని  గెజిటెడ్ & నాన్ గెజిటెడ్ పోస్టులకు Local Cader ను నిర్ణయిస్తూ Presidential order ఇవ్బబడినది. ఈ జాబితాలో Local Body, Semi Govt , Corporations , Project Posts ఉండవు.*
*👉 విద్యాశాఖ విషయంలోకి వస్తే DyEO, PEO DI  Dy DI, Samithi Extension officers (Present MEO), Govt Schools లోని Posts కు Presidential order  లో చోటు దక్కినది.*
*👉 Presidential order లోని Posts సంఖ్య పెరుగ వచ్చును. తగ్గవచ్చును, పేరు మారవచ్చును.*
*👉 Presidential  order లోని ఒక పోస్టును (Ex: MEO)  పదోన్నతి ద్వారా భర్తీ చేయాలంటే కేవలం Presidential order పోస్టు లోని  Local Cader కలిగిన feeder  Category నుండే భర్తీ చేయాలి గాని  Local Caderisation  కాని పోస్టులనుండే భర్తీ చేయాలి.*
*👉 మన సంఘాల కృషి వలన 1987  లో PR టీచర్ల సర్వీసులను ప్రొవిన్షలైజ్ చేసి ప్రభుత్వ  ఉద్యోగులతో సమానముగా అన్ని సౌకర్యాలు కల్పించారు. కాని ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటికీ చెప్పలేదు.*
*👉  1998  నవంబరు ముందు వరకు Local body Teachers కు ప్రభుత్వ టీచర్లకు వేరు వేరు సర్వీసు రూల్స్  ఉండేవి (278, 40).* 
*👉 రెండు దశాబ్దాల   పోరాట ఫలితముగా 1998  నవంబరులో ఉమ్మడి సర్వీసు రూల్స్ G.O లు 505, 538 వచ్చినవి.  అప్పటి వరకు Govt School Assistants  MEO FAC లుగా  పనిచేసేవారు. 2000 వరకు  Tribunal  లో పోరాడి  ఓడి పోయారు. 2000 లోనే PR & Govt టీచర్ల ఉమ్మడి సీనియారిటీతో  మిగతా టీచింగ్ పోస్టులతో పాటు MEO లుగా పదోన్నతులు వచ్చినవి. అలా 2003 వరకు జరిగినది. 2003 లో  Local Cader కాని PR టీచర్లకు Local Cader అయిన MEO, DyEO పదోన్నతులు ఇవ్వరాదని, ఉమ్మడి సీనియారిటీ పనికి రాదని  పేర్కొంటూ  High Court ఈ G.O లను  కొట్టివేసినది. ప్రభుత్వం 2005 లో మరల ఏకీకృత సర్వీసు రూల్స్ 95 & 96  G.O లను తెచ్చి  ఉమ్మడి పదోన్నతులు ఇచ్చినది. ఇవీ కోర్టులలో నిలువ లేదు.*
*👉 ఇక చేసేది లేక 2009 లో PR & Govt Teachers కు విడివిడిగా పదోన్నతుల ఛానల్స్ ను HM వరకు నిర్ణయిస్తూ Adhoc Service Rules (Present service rules)ను విడుదల చేసినది.*
*👉Rural MEO పోస్టుల భర్తీ కొరకు ధైర్యంగా 2017 లో G O No 10 ద్వారా PR టీచర్లకు MEO లుగా నియమించినది. ఈ నియామకాలను High court కొట్టివేసినా ఈ తీర్పును ,2003 తీర్పును అమలు  చేయకుండా ప్రభుత్వం నెట్టుకొస్తుంది. కాని ఇప్పుడు Contempt కేసులతో ప్రభుత్వం  నెత్తి మీదకు  వచ్చినది.*
*👉 2017 లో అసెంబ్లీ తీర్మానంతో  PR టీచర్లకు Local Cader  గా గుర్తిస్తూ MEO పోస్టులకు  పదోన్నతి కోసం Presidential Order కు సవరణ తెచ్చి ఏకీకృత సర్వీసు రూల్స్  G.O No 72,73,74 లు తేబడినవి. కాని Presidential Order లోని సాంకేతిక లోపాల వలన  ఇవి APAT & High  Court లో వెంటనే  నిరాకరించి Status Quo కు ఆదేశాలు ఇవ్బడినవి.*
*👉 మనమేకాక TS లో కూడా నూతన  జిల్లాల ఏర్పాటుతో క్రొత్త Presidential order తెచ్చినా 2019 లో High court లోని Pending WP కు లోబడి  అమలు చేయాలని G.O No 256 ను జారీ చేసినది. అక్కడ చేసేదేమీలేక School Complex HM లకు జీతాలు Draw చేసే Powers ఇచ్చారు.*
*👉 ఏతా వాతా తేలేదేమంటే..*
*📣PR & Govt Teachers ఉమ్మడి సీనియారిటీ కుదరదు.*
*📣 Presidential order ఉన్న MEO/Dy.EO పోస్టులకు Presidential Order లేని PR టీచర్లకు పదోన్నతి కుదరదు.*
*📣 చేసేదేమీలేక కునారిల్లుతున్న  పర్యవేక్షణ చూసి తట్టుకోలేక Govt HM/SA లకు MEO FAC లు గా ఇచ్చినది. CC కేసు తర్వాత వారికే MEO పదోన్నతులు ఇచ్చినా  ఆశ్చర్యపోనవసరం లేదు.*
*👉Govt & PR టీచర్ల  ఉమ్మడి సీనియారిటీ జాబితాలతో MEO/DyEO పదోన్నతులు ఇవ్వటం ఇక  కలలో జరగాల్సినందే కాని ఇలలో కాదు. ఎవరైనా చెప్పినా పక్కా మోసమే?  వాటి గురించి ఆలోచించకుండా PR టీచర్లకు ప్రత్యేక Promotion Channel కు Road Map వేయాలి.*
*👉 విద్యాశాఖ ఈమధ్య ప్రతిపాదించిన PR స్కూళ్ళకు విడిగా PR MEO & Dy.E.O  ఏర్పాటు మంచి ఆలోచనే. కాని  ఆర్ధిక మాంద్యంలో ఉన్న  ప్రస్తుత స్ధితిలో ఇది కార్యరూపము సాధించుట సాధ్యమా?  రాజకీయ నిర్ణయం తీసుకోవాలి.*
సేకరణ: వాట్సప్ మాధ్యమం
🌹

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!