విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనకు ప్రణాళిక: SCERT DIRECTOR
*📚✍️విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనకు ప్రణాళిక✍️📚*
*♦️ఎన్సీఈఆర్ టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి*
*🌻ఈనాడు, అమరావతి:* విద్యార్థులకు కనీసస్థాయి నైపుణ్యం తెలుసుకుని అందుకు అనుగుణంగా బోధన చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు ఎన్ సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. విద్యార్థుల అభ్యసన స్థాయి అంచనా వేయడానికి ప్రథమ్ సంస్థ రూపొందించిన ప్రశ్న పత్రాలను వినియోగించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. “ఈ పరీక్ష ఆధారంగా విద్యార్థులను 5 కేటగిరీలుగా వర్గీకరించాం. ఆయా కేటగిరీల ఆధారంగా బోధన అందిస్తాం. దీనికోసం ఎన్సీఈఆర్టీ తగిన మెటీరియల్ రూపొదించింది. 2 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు అందరికీ మొదట మౌఖిక పరీక్ష ద్వారా నైపుణ్యాన్ని పరిశీలించాం. అందులో 4, 5 కేటగిరిల్లో ఉన్న విద్యార్థులకు మళ్లీ రాత పరీక్ష నిర్వహించాం. ఈ పరీక్ష విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునే ఉద్దేశ్యంతో మాత్రమే నిర్వహించాం” అని తెలిపారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
You might also check these ralated posts.....